ఆచార్య.ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వ విధ్యాలయం
ఏరువాక కేంద్రము, బనవాసి, కర్నూలు జిల్లా.
“నల్ల రేగడి నేలలలో ఇరు పంటల విధానము( కొర్ర - శనగ ) మెట్ట వ్యవసాయానికి ఒక వరం”
యం.శివరామకృష్ణ, సస్యరక్షణ శాస్త్రవేత్త, డా. జి.ప్రసాద్ బాబు, సమన్వయ కర్త, ఏరువాక కేంద్రము, బనవాసి
కర్నూలు జిల్లాలో శనగ పంటను రబీ కాలములో దాదాపు 1,86000, హెక్టార్లలో విస్తీర్ణములో రైతులు
సాగుచేస్తునారు. శనగ పంటను రైతులు ఎక్కువ భాగము వర్షాధార నల్లరేగడి భూములలో పండిచుట జరుగుతూ
ఉన్నది. అయితే అధిక విస్తీర్ణములో వర్షాధారము లో శనగ పంట సాగు అవుట వల్లన శనగలో రైతులు ఆశించిన
మేరకు దిగుబడులు సాదించలేక ప్రతి యేట నష్టలా బారిన పడుతున్నారు. ఆంతేగాక సంవత్సరము మొత్తము లో
కేవలము మూడు నెలలు మాత్రమే శనగ పంటను పండించి ఖరీఫ్ కాలము మొత్తము పొలాన్ని ఖాళీగా
ఉంచుకోవడం ఈ జిల్లాలో శనగ రైతులకు పరిపాటి. ఖరీఫ్ కాలములో పొలాన్ని ఖాళీగా ఉంచడము వలన,
పొలం కలుపుతో నిండి పోయి ఆ కలుపు నిర్మూలనకు రైతులకు తిరిగి అధనపు వ్యయము ఖర్చు చేయవలసి
వస్తుంది. దీనితో శనగ పండించే రైతు కేవలము సంవత్సరము మొత్తము లో ఒకే పంటను పండించుట మూలాన
అధిక నిఖర ఆధాయన్ని పొందలేక పోవడమే గాక వనరులను పూర్తి స్థాయిలో
సమర్థవంతముగా వినియోగించుకొనలేక పోతున్నారు
READ MORE DOUBLE CROPPING SUCESS STORY